01:45 pm - Saturday 19 May 2012

సైలెంట్ గా సినిమా చేస్తున్న కళ్యాణ్ రాం ..

By admin - Thu Feb 16, 9:50 am

ఎనర్జిటిక్ హీరో కళ్యాణ్ రాం హీరోగా కెమెరామెన్ సునీల్ రెడ్డి
దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్
జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్
రాం నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రాం సరసన పులి సినిమా హీరోయిన్
నిఖిష పటేల్ హీరోయిన్ గా నటిస్తుంది. అతనొక్కడే మినహా చెప్పుకోదగ్గ హిట్
ని అందుకోలేని కళ్యాణ్ రాం ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలనే కసితో ఈ
సినిమా నిర్మిస్తున్నాడు. కళ్యాణ్ రాం ఇప్పటి వరకు చేసిన పాత్రలకు
పూర్తిభిన్నంగా ఈ సినిమాలో కళ్యాణ్ రాం పాత్ర ఉంటుందట. ఈ సినిమాని సమ్మర్
కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Leave a Reply

AdvertisementMedia School