01:43 pm - Saturday 19 May 2012

షిరిడి సాయి ఫస్ట్ లుక్ ఎలా ఉంది..?

By admin - Mon Jan 30, 11:10 am

టాలీవుడ్ కింగ్ నాగార్జున, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, స్వరవాణి
కీరవాణిల కలయికలో వస్తున్న మూడో అధ్యాత్మిక అద్భుత చిత్రం షిరిడి సాయి.
ఫిబ్రవరి 2 నుంచి కర్నాటకలోని ఓ గ్రామంలో షూటింగ్ ప్రారంభించనున్నారు.
25రోజులు పాటు జరిగే షూటింగ్తో తొలి షెడ్యూల్ పూర్తవుతుంది. అయితే ఇటీవల
రిలీజ్ చేసిన షిరిడి సాయి ఫస్ట్ లుక్ లో షిరిడి సాయిగా నాగార్జున గెటప్
కు అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ నుంచి అద్భుత స్పందన లభిస్తోంది.
అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాల స్థాయిని మించి షిరిడి సాయి చిత్రం సంచలన
విజయం సాధిస్తుందన్న టాక్ వినిపిస్తోంది..షిరిడి సాయి చిత్రం నాగార్జున
కెరీర్లోనే కాకుండా తెలుగు చలనచిత్ర చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించదగ్గ
చిత్రం అవుతుందని ఆశిద్దాం..

Leave a Reply

AdvertisementMedia School