08:26 am - Sunday 22 April 2012

శంకర్ దర్శకత్వంలో ప్రభాస్…?

By admin - Thu Feb 16, 9:43 am

గ్రేట్ డైరెక్టర్ శంకర్ తాజాగా తెరకెక్కించనున్న సినిమాలో ప్రభాస్
నటించనున్నాడనే వార్తలు ఫిలింనగర్లో షికారు చేస్తున్నాయి. త్రీ ఇడియట్స్
రీమేక్ స్నేహితుడు చిత్రాన్ని తెలుగు, తమిళ్ లో రూపొందించినప్పటికీ
విజయాన్ని సాధించలేకపోయింది. మళ్లీ స్ట్రైయిట్ మూవీతో విజయాన్ని
సాధించాలనే ఉద్దేశ్యంతో కథను సిద్దం చేస్తున్నాడట. తెలుగు, తమిళ్,
మలయాళంలో రూపొందే ఈ సినిమాలో తమిళ్ లో కమల్ హాసన్, మలయాళంలో మోహన్
లాల్..తెలుగులో ప్రభాస్ నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ
వార్త నిజమా కాదా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Leave a Reply

AdvertisementMedia School