పూల రంగడు సునీల్ కే కీలకం
By admin - Mon Jan 30, 11:03 am
- 0 Comments
- 89 views
- Tweet
తెలుగు సినిమాలో ఇంతవరకు కమెడియన్ గా కనిపించిన సునీల్ ఇక నుంచి పూర్తి
స్తాయి హీరోగా కన్పించనున్నాడు. ఇంతవరకు చేసిన రెండు సినిమాల్లో కూడా
హీరోనే కదా అనే అనుమానం రావొచ్చు. అందాల రాముడు, మర్యాద రామన్న రెండు
సినిమాల మద్య చాల గ్యాప్ వచ్చింది. మర్యాద రామన్న సినిమా రాజమౌళికి పేరు
తెచ్చి పెట్టింది తప్ప సునీల్ కు ఒరిగిందేమిలేదు. ఇక రాంగోపాల్ వర్మ
చేసిన కథ స్క్రీన్ప్లే దర్శకత్వం అప్పలరాజు సినిమా ఫ్లాప్ అయింది. దీంతో
సునీల్ హీరోయిజం , కెరీర్ మొత్తం పూలరంగడు సినిమా పైనే ఆధారపడి ఉంది.
అందుకే సిక్స్ ప్క్యాక్ కూడా చేసాడు. ఈ సినిమా హిట్ కావడం సునీల్ కెరీర్
కు ఎంతో అవసరం. పూల రంగడు కనుక తేడా వస్తే ఇటు హీరోగా, అటు కమెడియన్ గా
కూడా పనికి రాకుండా పోతాడు. అందుకే కాబోలు సునీల్ ఈ సినిమా పై భారిగా
ఆశలు పెట్టుకొని ఉన్నాడు.
- 0 Comments
- 89 views
- Tweet






